చందమామ కాజల్ ఫాలోయింగ్ లో తనకు తిరుగులేదని నిరూపిస్తుంది. దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. ప్రస్తుతం మెగాస్టార్  చిరంజీవి సరసన ఆచార్య మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2లో ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా కాజల్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

ఇక సోషల్ మీడియాలో కాజల్ పెద్దగా సందడి చేయరు. ముఖ్యమైన విషయాలపై మినహాయించి స్పందించరు. ఐతే తన ఫోటోలను మాత్రం ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటుంది. దీనితో కాజల్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్స్ కి చేరింది. అంటే ఈమెను ఇంస్టాగ్రామ్ లో 1.5 కోట్ల మంది అనుసరిస్తున్నారన్న మాట. టాలీవుడ్ నుండి రకుల్ తరువాత ఈ 15 మిలియన్స్ ఫాల్లోవర్స్ కలిగిన హీరోయిన్ గా ఆమె రికార్డు కొట్టారు. 

కాజల్ ఫాలోవర్స్ ఈ రేంజ్ లో పెరిగిపోతున్న నేపథ్యంలో  ఆమెకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని అర్థం అవుతుంది. ఇక ప్రస్తుతం కాజల్ చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. ఆచార్య, భారతీయుడు 2 అనే రెండు భారీ చిత్రాలతో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తుంది. ఒక హిందీ చిత్రంతో పాటు రెండు తమిళ చిత్రాలలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.