ఒకవైపు ‘భరత్ అనే నేను’ టీజర్ ఇంటర్నెట్ లో సునామీని క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబు పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్ సంచలనంగా మారింది. తెలుగులో స్టార్ హీరోలు పొలిటికల్ కాన్సెప్ట్స్ జోలికి వెళ్లరు. అలాంటిది మహేశ్ వంటి హీరో ప్రమాణ స్వీకారం చేస్తున్న డైలాగ్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తే.. అది సినిమాపై అమితమైన ఆసక్తిని పెంచుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే జరుగుతోంది.ఈ సంగతిలా ఉంటే..మరోవైపు భరత్ గురించి ఆసక్తిదాయకమైన వివరాలు వెల్లడి అవుతున్నాయి. సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి కూడా కొంత క్లారిటీ వస్తోంది. సోర్సెస్ ఇస్తున్న సమాచారం ప్రకారం.. ఇందులో హీరోయిన్ కైరా అద్వానీది మహేశ్ కు పీఏ పాత్ర!ఇది వరకూ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా కొంత పరిచయం ఉన్న నటీమణి కైరా. ఇప్పుడు మహేశ్ తో జత కడుతోంది. గ్లామరస్ పీఏ పాత్రలో కనిపించబోతోందని సమాచారం. మరి రాజకీయ నేత అయిన హీరోకి, గ్లామరస్ పీఏకు మధ్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉంటుందో!