Asianet News TeluguAsianet News Telugu

Kaikala Satyanarayana Health Update: ఇంకా క్రిటికల్‌గానే ఆరోగ్యం.. ఐసీయులోనే చికిత్స

లెజెంటరీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం కారణంగా శనివారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని తెలిపారు. 

kaikala satyanarayana health update still condition very critical
Author
Hyderabad, First Published Nov 21, 2021, 8:56 PM IST

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana Health Update) హెల్త్ బులెటిన్‌ వచ్చింది. ఆరోగ్యంపై వైద్యులు అఫీషియల్‌ నోట్ విడుదల చేశారు. కైకాల ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉందని స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. బీపీ లెవల్స్ తక్కువగానే ఉన్నాయని, ఇంకా వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నట్టు చెప్పారు. Kaikala Satyanarayana స్పృహలోనే ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఎలాంటి బ్లీడింగ్స్ లేవని తెలిపారు. ఆదివారం(21 నవంబర్‌) సాయంత్రం వైద్యులు కైకాల హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. 

లెజెంటరీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం కారణంగా శనివారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని తెలిపారు. ఆయన్ని కాపాడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో కైకాల సత్యనారాయణ కాలుజారి కిందపడిపోయారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. దాన్నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ ఇలా అస్వస్థతకి గురి కావడం బాధాకరం. 

కైకాల అరోగ్యంపై సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. చిరంజీవి ఆయన ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులతో ముచ్చటించారు. క్రిటికల్ కేర్‌ డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడినట్టు చెప్పారు చిరు. ఆయనతో మాట్లాడిన తర్వాత కైకాల కోలుకుంటారనే నమ్మకం పెరిగిందన్నారు. ట్రాకియాస్టోమి అనే రుగ్మతతో కైకా బాధపడుతున్నారని, ఆయన మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని, అప్పుడు అందరం సంబరాలు చేసుకోవాలని తెలిపారు. 

86ఏళ్ల జీవితంలో ఆరు దశాబ్దాలపాటు సినిమాల్లోనే బతికారు కైకాల సత్యనారాయణ. తొలితరం నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌, ఎస్వీఆర్ లకు సమకాలీకులు కైకాల. వారితో అనేక చిత్రాల్లో నటించారు. పౌరాణిక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. ముఖ్యంగా యముడు పాత్ర అంటూ కైకాల సత్యనారాయణ రూపమే గుర్తొస్తుందంటే అతిశయోక్తికాదు. అంతగా ఆ పాత్రల్లో నటించారు. మెప్పించారు. పాత్రలో జీవించి, ఆ పాత్రకే ప్రాణం పోశారు. పౌరాణికాలు, జానపద చిత్రాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ నటించారు. అన్ని రకాల పాత్రలు పోషించారు. విలనిజానికి కొత్త అర్థాన్నిచ్చారు. అంతేకాదు విలన్‌ అనే పదానికే వన్నె తెచ్చారు కైకాల. 

also read: Kaikala Satyanarayana: కైకాలను పలకరించారు... తిరిగివచ్చాక సంబరాలు చేసుకుందాం

also read: ఎన్టీఆర్ పెట్టిన కండీషన్‌ను బ్రేక్ చేసిన కైకాల సత్యనారాయణ... ‘దాన వీర శూర కర్ణ’ సమయంలో...

Follow Us:
Download App:
  • android
  • ios