హైపర్ ఆది టార్గెట్ గా జబర్దస్త్ పై కత్తిమహేష్ అనాధల కేసు

kahthi mahesh and orphans filed case against jabardasth program
Highlights

  • టీవీ లైవ్ లో తనపచ్ల అవమానకరంగా మాట్లాడిన హైపర్ ఆది టార్గెట్ చేసిన కత్తి మహేష్
  • జబర్దస్త్ పై అనాధలను అవమానించారంటూ కేసు నమోదు
  • తక్షణం జబర్దస్త్ కార్యక్రమం రద్దు చేయాలని డిమాండ్

తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో పై గత కొన్ని రోజులుగా ఎన్నో వివాదాలు వస్తున్నాయి.  ఇక జబర్ధస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కొట్టేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రష్మి లకు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో తెలిసిందే.

 

జబర్ధస్త్ కామెడీ షో కి వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో అసభ్యత శ్రుతి మించుతోంది. మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నా... షోను అడ్డుకునే పరిస్థితి లేకపోవడంతో రేటింగ్స్ పరమావధిగా చూస్తే టాప్ ప్రోగ్రామ్ గా రన్ అతోంది. అతే అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా జోకులు ఉంటున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే... హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.

 

హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. ఈ మద్య ప్రసారమైన ఓ స్కిట్ లో అనాధలపై వల్గర్ గా కామెంట్ చేశారని, జబర్దస్త్ కార్యక్రమం వెంటనే నిలిపివేయాలని కోరారు.

 

ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. తన మద్దతు అనాథలకే అని చెప్పాడు. ఇక ఇటీవల ఓ ఛానెల్ డిస్కషన్ షోలో కత్తి మహేష్ తో హైపర్ ఆది అతిగా బిహేవ్ చేశాడని, అందుకే ఈ షాక్ ఇచ్చాడని వినిపిస్తోంది. మొత్తానికి జబర్దస్త్ ప్రోగ్రామ్ పై కేసు నమోదు కావటంతో తదుపరి ఏం జరుగుతుందనేది చర్చనీయాంశమైంది.

loader