ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు ఖాదర్ ఖాన్ అస్వస్థతకి గురైనట్లు తెలుస్తోంది. కెనడాలో ఉంటోన్న ఆయన గురువారం రాత్రి శ్వాస ఆడడం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు.

వెంటిలేటర్ పై పెట్టి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పరిస్థితి విషయం ఉందని అంటున్నారు. కొంత కాలంగా ఆయన న్యుమోనియాతో బాధ పడుతున్నారని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారనే వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగు పడడం లేదట. హిందీలో ఆయన 'ముజ్ సే షాదీ కరోగీ', 'లక్కీ', 'జోరూ కా గులాం' ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.