బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అర్జున్ రెడ్డి కథ భారీ వసూళ్లను అందుకుంటోంది. తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ భారీ వసూళ్లతో షాకిస్తున్నాడు. షాహిద్ కపూర్ - కైరా అద్వానీ జంటగా నటించిన ఈ రీమేక్ ను ఒరిజినల్ దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి రోజే ఎవరు ఊహించని విధంగా 20.21కోట్లను వసూలు చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక శనివారం అయితే 22.71కోట్లతో నిర్మాతల ధైర్యాన్ని పెంచింది. మొత్తంగా సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 42.92కోట్లు.  

ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే షాహిద్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చెప్పవచ్చు. చూస్తుంటే 100కోట్ల క్లబ్ లో చేరడానికి కబీర్ సింగ్ కి పెద్దగా టైమ్ పట్టేలా లేదు. మొత్తానికి దర్శకుడు సందీప్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఈ బాక్స్ ఆఫీస్ హిట్ తో మనోడు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.