పలు చిత్రాల్లో నటించిన కోలివుడ్ తార కాజల్ పశుపతి 'బిగ్ బాస్' సీజన్ 1తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ఆమె దర్శకుడు సుందర్ తెరకెక్కించిన 'కలకలప్పు2' సినిమా కనిపించింది.

సినిమాల్లో బిజీగా ఉన్నా.. ఈ నటి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అటువంటిది కొద్దిరోజులుగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టడం, అభిమానులకు రిప్లయ్ ఇవ్వడం తగ్గించేసింది.

ఇదే విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఎక్కువగా ఆడడం వలన కంటిచూపు దెబ్బతిందని, సెల్ ఫోన్ ను చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చారని, ఆ కారణం చేతనే ట్విట్టర్ లో యాక్టివ్ గా లేనని కాజల్ చెప్పింది.

మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వలన వచ్చే ఇబ్బందులను తను స్వయంగా అనుభవిస్తున్నానని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె వెల్లడించింది.