Asianet News TeluguAsianet News Telugu

కె విశ్వనాథ్‌, ఎస్పీబాలు, చంద్రమోహన్‌ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలుసా? ముగ్గురు కలిసి చరిత్రకి నాంది

కె విశ్వనాథ్‌కి, ఎస్పీ బాలుకి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయట. అలాగే సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. మరి ముగ్గురు మూడు విభాగాల్లో దిగ్గజాలుగా ఎదిగిన వీరి ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

k viswanath sp balu chandramohan close relatives they create history here how ?
Author
First Published Feb 3, 2023, 1:57 PM IST

కళాపతపస్వి కె విశ్వనాథ్‌ అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమని ఏలిన ఆయన సినిమాని కొత్త పుంతలు తొక్కించారు. గౌరవాన్ని తీసుకొచ్చారు. దాదాపు 53 అద్భుతమైన కళాఖండాలను అందించారు విశ్వనాథ్‌. సాంప్రదాయ, శాస్త్రీయ సంగీతానికి పెద్ద పీట వేశారు. సాంప్రదాయాల చాటున సాగే మూఢ విశ్వాసాలను బట్టబయలు చేశారు విశ్వనాథ్‌. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద లోటు. 

ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం గాన గాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన విషయం తెలిసిందే. కె విశ్వనాథ్‌కి, ఎస్పీ బాలుకి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయట. అలాగే సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. మరి ముగ్గురు మూడు విభాగాల్లో దిగ్గజాలుగా ఎదిగిన వీరి ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే.. 

చంద్రమోహన్‌కి పెదనాన్న రెండో భార్య కొడుకు కె విశ్వనాథ్‌. చంద్రమోహన్‌ తల్లి, కె విశ్వనాథ్‌ తండ్రి మొదటి భార్య అక్కా చెళ్లెళ్లు. అలా వీరిద్దరు అన్నాదమ్ములు అవుతారు. అలాగే చంద్రమోహన్‌ బావ మరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు.అలా వీరిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. ఇలా ఈ ముగ్గురికి ఫ్యామిలీ పరంగా మంచి రిలేషన్‌ షిప్‌ ఉంది. ముగ్గురూ అన్నదమ్ములు కావడం విశేషం. ఆ విషయం సినిమాల్లోకి వచ్చిక తెలిసింది. కానీ దాన్ని బయటకు రాకుండానే మ్యానేజ్‌ చేస్తూ తమ రంగాల్లో రాణిస్తూ, ఎదుగుతూ వచ్చారు. 

ఇదిలా ఉంటే ఈ ముగ్గురు కలిసి ఓ చరిత్రకి నాంది పలికారు. అదే `శంకరాభరణం`. ఈ చిత్రానికి కె విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా, ఇందులో ఓ కీలక పాత్రలో చంద్రమోహన్‌ నటించారు. మరోవైపు ఇందులో బాలసుబ్రమణ్యం పాడిన పాటలు ఎంతటి వినసొంపుగా ఉంటాయో తెలిసిందే. అలా ఈ ముగ్గురు కలిసి చేసిన అద్భుతం `శంకరాభరణం`. ఈ సినిమా మొదట పెద్దగా ఆదరణ పొందలేదు. వారం పది రోజుల తర్వాత నెమ్మదిగా జనాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత సంచలన విజయం సాధించింది. జాతీయఅవార్డులను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే కె విశ్వనాథ్‌ 1966లో `ఆత్మ గౌరవం` చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం కాగా, అదే ఏడాది `రంగులరాట్నం` చిత్రంతో నటుడిగా చంద్రమోహన్‌ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఏడాది తర్వాత `శ్రీ శ్రీ మర్యాద రామన్న` చిత్రంతో సింగర్‌గా బాలు వెండితెరకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ తమ విభాగాల్లో ఉన్నతులుగా ఎదిగారు. వీరిలో ఇద్దరు ఈ లోకాలను విడిచి వెళ్లిపోవడం విచారకరం. చంద్రమోహన్‌ వయసు రీత్యా సినిమాలు తగ్గించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios