బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ మారో భారీ ప్రాజెక్ట్ కి తన పెన్నును వాడబోతున్నాడు. స్క్రీన్ ప్లే విషయంలో సహాయం కోరుతూ ఓ మలయాళం దర్శకుడు చేసిన రిక్వెస్ట్ కి ఈ స్టార్ రైటర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే బాలీవుడ్ - కోలీవుడ్ లో స్టార్స్ తో వర్క్ చేసిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టబోతున్నాడు. విజేష్ మని తెరకెక్కించనున్న 100కోట్ల యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సినిమాకు  సంబందించిన స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చేసిన కొన్ని మార్పులు నమ్మకంగా అనిపించడం లేదట. 

స్క్రిప్ డిస్కర్షన్స్ లో అనుమానాలు మొదలయ్యాయట. అందుకే విజయేంద్ర ప్రసాద్ సహాయాన్ని కోరుతున్నారు. గతంలో ఇదే తరహాలో కోలీవుడ్ దర్శకుడు అట్లీ.. విజయ్ మెర్సల్ సినిమా కోసం ఈ రైటర్ సహాయాన్ని తీసుకొని ఈజీగా స్క్రీన్ ప్లేను సెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకా నటీనటులు సెలెక్ట్ కానీ మలయాళం కథ కోసం దర్శకుడు విజేష్ బాహుబలి రచయితతో చేతులు కలిపాడు.