డైరెక్ట్ చేయాలనుకుంటే.. హీరోయిన్ చనిపోయింది!

First Published 30, Jun 2018, 4:21 PM IST
k s ramaravo about his directional dream
Highlights

ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు ఇప్పుడు బాగా స్లో అయిపోయారు

ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు ఇప్పుడు బాగా స్లో అయిపోయారు. ప్రస్తుతం ఆయన సాయి ధరం తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది.

నిర్మాతగా దాదాపు 45 సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు డైరెక్టర్ గా కూడా పని చేయాలని అనుకునేవారట. ఈ క్రమంలో ఓ కథ సిద్ధం చేసుకొని ప్రముఖ హీరోయిన్ కు వినిపించారట. దానికి ఆమె తన అన్నయ్యని అడిగి చెబుతానని.. దాదాపు సినిమా పట్టాలెక్కే సమయంలో ఆమె ఓ ప్రమాదంలో చనిపోయిందని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ హీరోయిన్ సౌందర్య అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె మాత్రమే తన అన్నయ్యని అడిగి సలహాలు  తీసుకునేదని సమాచారం. హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఇక కె.ఎస్.రామారావు నిర్మాణ రంగంలో కాస్త స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఈయన నిర్మాణంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. 

loader