కె.రాఘవేంద్రరావు టీటీడీ బోర్డు చైర్మన్.. నిజం లేదు

First Published 25, Jan 2018, 11:55 AM IST
k raghavenderrao rejected rumours about ttd chairman post
Highlights
  • గత కొంత కాలంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్ అంటూ పుకార్లు
  • సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో రాఘవేంద్రరావుకు అభినందనల వెల్లువ
  • అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదన్న దర్శకేంద్రుడు 
  • ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి పై కొత్త ప్రోగ్రామ్స్ రూపొందించడం తనకెంతో ఆనందమన్న దర్శకేంద్రుడు

గత రెండు,మూడు రోజులుగా కొన్ని పత్రికలలో, సోషల్ మీడియా లో 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు తి.తి.దే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాది మంది ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె.రాఘవేంద్ర రావు ఖండించారు. ఎస్.వి.ఎస్.సి ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానల్ లో స్వామివారి పై మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటి ని అలరిస్తూ స్వామివారి సేవ లో తరించాలన్నది ఒకటే తన కోరిక అని 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.

loader