సౌత్ లో ఉన్న స్టార్ హీరోల్లో సూర్య ఒక్కడే అందరికంటే స్పీడ్ గా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మూడు కథలను లైన్ లో పెట్టిన ఈ హీరో ఓ వైపు ప్రొడక్షన్ హౌస్ ను కూడా చాలా పద్దతిగా మెయింటైన్ చేస్తున్నాడు. 

ఇప్పటికే 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో  తమ్ముడితో ఒక సినిమా చేసిన సూర్య భార్యతో కూడా మరో సినిమాను నిర్మిస్తున్నాడు. జాక్ పాట్ అనే ఒక డిఫరెంట్ సినిమాలో జ్యోతిక నటిస్తోంది. సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రేవతి ఒక ముఖ్యమైన పాత్రలో .నటిస్తోంది. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా సూర్య రిలీజ్ చేశాడు. 

సరికొత్తగా జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిందని చెప్పవచ్చు. పోస్టర్ లో ఆమె గెటప్స్ కి కూడా మంది రెస్పాన్స్ వస్తోంది. ఇక నేడు NGK ట్రైలర్ తో ఓ వర్గం ప్రేక్షకులను సూర్యా బాగానే ఆకట్టుకున్నాడు. మరి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే మే31 వరకు వెయిట్ చేయాల్సిందే.