రియా అరెస్ట్‌పై బాలీవుడ్ భగ్గుమంది. రియాను ఉద్దేశపూర్వకంగా వేదిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ భావాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు. ఇటీవల ఇన్వెస్టిగేషన్‌కు హాజరైన సందర్భంగా రియా వేసుకున్న టీషర్ట్‌ మీద ఉన్న కొటేషన్‌ లైన్స్‌ను తమ సోషల్‌ మీడియా పేజ్‌లలో పోస్ట్ చేస్తున్నారు స్టార్స్.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసు పూర్తి రియా కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. రియా సుశాంత్‌కు డ్రగ్స్‌ ఇచ్చిందన్న ఆరోపణలు రావటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ముందుగా రియా సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసిన అధికారులు, తాజాగా మూడు రోజుల విచారణ తరువాత రియాను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే రియా అరెస్ట్‌పై బాలీవుడ్ భగ్గుమంది. రియాను ఉద్దేశపూర్వకంగా వేదిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ భావాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు. ఇటీవల ఇన్వెస్టిగేషన్‌కు హాజరైన సందర్భంగా రియా వేసుకున్న టీషర్ట్‌ మీద ఉన్న కొటేషన్‌ లైన్స్‌ను తమ సోషల్‌ మీడియా పేజ్‌లలో పోస్ట్ చేస్తున్నారు స్టార్స్. రియా అరెస్ట్‌కు నిరసనగా కొంత మంది బాలీవుడ్‌ తారలు బ్లాక్‌ స్క్రీన్‌ను పోస్ట్ చేశారు.

రియాను ఓ మంత్రగత్తెను వేటాడినట్టుగా వేటాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు బాలీవుడ్ తారలు. దీంతో #JusticeforRhea నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్‌ అవుతోంది. రియాకు మద్దతు పలికిన వారిలో సోనమ్ కపూర్‌, విద్యా బాలన్, పుల్కిత్‌ సామ్రాట్‌, హుమాఖురేషీ, దియా మీర్జా, అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్స్‌ ఉన్నారు. ఏడాది జూన్‌ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన మృతికి నెపోటిజం కారణం అనుకున్న తరువాత కేసు పూర్తిగా రియా వైపు మళ్లింది.

View post on Instagram
View post on Instagram
View post on Instagram
View post on Instagram