ఎట్టకేలకు వకీల్ సాబ్ మూవీ థియేటర్స్ లో దిగింది. గురువారం అర్థ రాత్రి యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా, తెలంగాణా రాష్ట్రంలో తెల్లవారుజాము నుండి షోలు పడుతున్నాయి. ఇక వకీల్ సాబ్ సినిమా చూసిన వాళ్ళు తమ రెస్పాన్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
ఎట్టకేలకు వకీల్ సాబ్ మూవీ థియేటర్స్ లో దిగింది. గురువారం అర్థ రాత్రి యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా, తెలంగాణా రాష్ట్రంలో తెల్లవారుజాము నుండి షోలు పడుతున్నాయి. ఇక వకీల్ సాబ్ సినిమా చూసిన వాళ్ళు తమ రెస్పాన్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
దాదాపు వకీల్ సాబ్ చిత్రానికి పాజిటివ్ టాక్ అందుతుంది. సరిపడా కమర్షియల్ అంశాలు జోడించిన, జెన్యూన్ రీమేక్ గా వకీల్ సాబ్ చిత్రం గురించి ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా పవన్ నటన విశ్వరూపం చూపించారంటూ పొగిడేస్తున్నారు.
ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కొంచెం లేట్ గా ఉంటుంది. అలాగే ప్రారంభంలో సన్నివేశాలు పూర్తిగా ముగ్గురు అమ్మాయిల చుట్టే తిరుగుతాయి. ఈ కారణంగా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ లో మూవీ ఊపందుకుందని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్ట్ రూమ్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయట. వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడి మరి నటించారని నెటిజెన్స్ అంటున్నారు. సోషల్, పొలిటికల్ పంచెస్, సెటైర్స్ కూడా బాగా పేలాయని అంటున్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ టేకింగ్ కి సైతం ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఓ సోషల్ సబ్జెక్టులో హ్యాండిల్ చేసిన విధానం బాగుందని అంటున్నారు. వకీల్ సాబ్ మూవీతో వేణు శ్రీరామ్ కి బ్రేక్ వచ్చేలా కనిపిస్తుంది.
వకీల్ సాబ్ ప్లస్ పాయింట్స్ లో నెటిజెన్స్ ప్రస్తావిస్తున్న మరొక అంశం థమన్ మ్యూజిక్. ముఖ్యంగా థమన్ అందించిన బీజీఎమ్ అద్భుతం అన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, పవన్ ఎలివేషన్ సీన్స్ తెరపై పండడానికి బీజీఎమ్ హెల్ప్ అయ్యిందని మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఇక కథలో ప్రధాన పాత్రలు చేసిన అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ నటన మెచ్చుకోవిధంగా ఉందంటున్నారు ప్రేక్షకులు.
వకీల్ సాబ్ లో మైనస్ విషయాలను ప్రస్తావించాల్సి వస్తే... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. అలాగే కమర్షియల్ అంశాల కోసం మూలకథకు పూర్తి న్యాయం చేయలేదన్న మాట వినిపిస్తుంది. మొత్తంగా వకీల్ సాబ్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అంటున్నారు.
