Asianet News TeluguAsianet News Telugu

‘సింహాద్రి’ 4కే వెర్షన్ లోడింగ్? ఆ ప్రత్యేకమైన రోజున రీరిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ రీరిలీజ్ కు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. 4కే వెర్షన్ లో ప్రింట్ రెడీ అవుతోందని.. త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది.

Junior Ntrs Simhadri movie Re release Upadate nsk
Author
First Published Jan 17, 2023, 2:06 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను ఫ్యాన్స్ కోసం వారి బర్త్ డేలు, పలు ప్రత్యేకమైన రోజుల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు. 4k వెర్షన్ లో మరింత బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేశ్ బాబు, ప్రభాస్ ల గత చిత్రాల రీరిలీజ్ లకు మాస్ రెస్పాన్స్ దక్కుతోంది. మరోవైపు కోట్లట్లో బిజినెస్ కూడా అవుతోంది. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోల గత చిత్రాల రీ-రిలీజ్ తో థియేటర్లలో రచ్చ చేశారు. 

తాజా సమాచారం ప్రకారం..  యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ రీరిలీజ్ కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రారంభించినట్టు సమాచారం. సినిమాకు 4కే వెర్షన్ లో అప్డేట్ చేసి ప్రింట్ సిద్ధం చేస్తున్నారని టాక్. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రీరిలీజ్ ద్వారా తప్పకుండా రికార్డు బ్రేక్ చేసేలా వసూళ్లు రాబడుతతుందని అంటున్నారు. అయితే చిత్రాన్ని తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారంట. బర్త్ డే స్పెషల్ గా మే20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో ఇప్పటికే రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా గ్లోబల్ ఈవెంట్లలో సందడి చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందింది. ఇక ఆస్కార్ బరిలోనూ ఒరిజినల్ స్కోరింగ్ విభాగంలో ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఎన్టీఆర్ పేరు కూడా ఆస్కార్క్ కు వినిపిస్తుండటం విశేషం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్30’, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్31’లో నటించబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios