టీవీ స్టార్ గా మారబోతున్న జూనియర్ ఎన్టీఆర్ వరుస సక్సెస్ లతో ఎన్టీఆర్ ఫుల్ జోష్  అదే క్రేజ్ మరింత పెంచుకునేందుకు తెలుగు లోగిళ్లలోకి ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు స్టార్ మా టీవీ లో హోస్ట్ గా ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ మనువడిగానే కాక, నందమూరి వారసుడిగా తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరుసగా విజయాలుు సాధిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు వారి లోగిళ్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ మా నిర్వహించనున్న బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇది అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు ఛానెల్ నెట్ వర్క్ అధికారులు.

సో త్వరలోనే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త అవతారం ఎత్తబోతున్నారన్నమాట. సోనీ చానల్‌లో బహుళ ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘ స్టార్‌ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హిందీలో ఈ బిగ్‌ బాస్‌ కు కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

బిగ్‌ బాస్‌ షూటింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షోకు ఎన్టీఆర్‌ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరకు అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు రీసెంట్ సిరీస్ కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ద్వారా తెలుగు వారి ఇళ్లలో ప్రత్యక్షమయ్యారు. ఇక ఇప్పటికే తమిళంలో అగ్రనటుడు కమల్‌ హాసన్‌ ...‘బిగ్‌ బాస్‌’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.