అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీ అంతా బన్నీకి శుభాకాంక్షలు తెలిపింది. ఆకరికి హాలీవుడ్ స్టార్స్ కూడా అల్లుకి హ్యాపీ బర్త్ డే చెప్పారు. ఇక కాస్త లేట్ గా చెప్పినా.. డిఫరెంట్ గా చెప్పాడు తారక్.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఈరోజు 41 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ , బాలీవుడ్ తో పాటు.. స్టార్ క్రికెటర్స్ కూడా బన్నీకి బర్త్ డే విషెష్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ ను విష్ చేశారు. ఈక్రమంలో అందరూ ఎన్టీఆర్ విష్ చేయలేదేంటని ఎదురు చూశారు. కాస్త లేట్ గాచెప్పినా.. కాస్త డిఫరెంట్ గా అల్లు అర్జున్ ను విష్ చేశాడు ఎన్టీఆర్. అల్లు అర్జున్ బర్త్‌డే కావడంతో ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు తారక్. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
బన్నీకి బర్త్ డే విషెష్ చెపుతూ.. హ్యాపీ బర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హగ్స్ అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రిప్లైకు వెంటనే ఎన్టీఆర్ అదిరిపోయేలా మరో రిప్లై ఇచ్చాడు. ఓన్లీ హగ్సేనా… పార్టీలేదా పుష్ప అంటూ.. ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు.. నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరిగిన ట్విట్టర్ చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత క్లోజ్ గా వీరు చాట్ చేసుకోవడంతో.. ఇద్దరు హీరోల అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.
అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్... చాలా చనువుగా ఇద్దరు బావా బావా అని పిలుచుకుంటారు. గతంలో కూడా వీరు విష్ చేసుకున్నా.. ఏమైనా చాట్ చేసుకున్నా.. బావా అనుకుంటూనే మాట్లాడుకుంటారు. అంతే కాదు ఇద్దరి ఇళ్ళలో.. ఏమైనా శుభకార్యాలు జరిగినా.. ఒకరింట్లో జరిగే శుభకార్యాలకు మరొకరు హాజరవుతుంటారు. ఒకరి సినిమాలను మరోకరు ప్రొత్సహించుకుంటుంటారు. పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్‌ను ఎన్టీఆర్ మంచి సపోర్ట్ చేశాడు. అటు ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో కూడా అల్లు అర్జున్ ఎన్టీఆర్‌కు సపోర్ట్‌ను అందించారు.
ఈ ఇద్దరు స్టార్లు బంధువులు కాకపోయినా... రక్త సంబంధం లేకపోయినా.. మంచి సాన్నిహిత్యంమాత్రం ఉంది. ఎన్టీఆర్ కు చరణ్ కంటే ముందు నుంచే బన్నీతో ప్రెడ్షిప్ ఉంది. ఇక వీరిద్దరు కలిసి భారీ మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొంత మంది సోషలక్ మీడియా వేధికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు కూడా. అది కూడా రాజమౌళి చేస్తే చూడాలని ఉందంటున్నారు కొంత మంది ఫ్యాన్స్.
ఇక బన్నీ పుష్ప సీక్వెల్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన డిఫరెంట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతా ఈ లుక్ గురించే మాట్లాడుకుటున్నారు. ఈమూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. సుకుమర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను మరోసారి పాన్ ఇండియా టార్గెట్ గా బన్నీ తీసుకెళ్లబోతున్నాడు. పుష్పతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ.. పుష్ప2ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. ఇక అటు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ హడావిడి అయిపోవడంతో.. రీసెంట్ గా NTR30 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
