నా జీవితం నాశనం చేశారు... గీతూ రాయల్ పై పరువు నష్టం దావా వేస్తానంటున్న నటి!
ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన నటి సౌమ్య శెట్టి తన జీవితం నాశనం చేశారంటూ ఆవేదన చెందింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూ రాయల్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది.
జూనియర్ ఆర్టిస్ట్, నటి సౌమ్య శెట్టి ఇటీవల అరెస్ట్ అయ్యింది. విశాఖపట్నం దొండపర్తిలో నివసించే రిటైర్డ్ పోస్టర్ అధికారి జనపాల ప్రసాద్ బాబు ఇంట్లో సౌమ్య శెట్టి 74 తులాల బంగారం దొంగిలించిందని పోలీసులు అరెస్ట్ చేశారు. నగలతో గోవా పారిపోయిన సౌమ్య శెట్టి కొంత బంగారం అమ్మేసిందట. అనంతరం సౌమ్య శెట్టిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 40 తులాల బంగారం రికవరీ చేశారట. మిగతా బంగారం ఆమె అమ్మి ఖర్చు చేసినట్లు పోలీసుల సమాచారం.
అయితే తనపై తప్పుడు కేసు పెట్టారు అంటుంది నటి సౌమ్య శెట్టి. ఇంస్టాగ్రామ్ వేదికగా దొంగతనం ఆరోపణల మీద ఆమె స్పందించారు. ఆమె మాట్లాడుతూ... నా మీద తప్పుడు కేసు బనాయించారు. రిమాండ్ లో లేకపోయినా, జైలుకు వెళ్లకపోయినా వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారు.. జాతీయస్థాయిలో నన్ను అన్ పాప్యులర్ చేశారు. నిజం ఏమిటో మాట్లాడుతుంటే పలు కేసులు పెట్టి నా నోరు నొక్కేస్తున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
మీరు అబద్దాన్ని నిజం చేయవచ్చు. నాకు దొంగ అనే ట్యాగ్ తగిలించి పిచ్చికుక్క మాదిరి జైల్లో వేయాలి అనుకున్నారు. నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. కోర్టులో ఏదీ రుజువు కాకముందే నాపై దుష్ప్రచారం చేశారు. నా జీవితాన్ని, కెరీర్ ని నాశనం చేశారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నేను పోరాడతాను, అని అన్నారు. సౌమ్య శెట్టిపై దొంగతనం కేసు పెట్టిన రిటైర్డ్ పోస్టల్ అధికారి ప్రసాద్ బాబు కుటుంబంపై ఆమె మానవహక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేసింది. అలాగే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో చేసిన బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్, యాంకర్ ధనుష్ ల మీద పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆమె తెలియజేశారు.