లొంగదీసుకున్నాడు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన రోజా!

junior artist roja files complaint against srishanth
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల భద్రత కోసం 'మా' అసోసియేషన్ ప్రత్యేకంగా ఓ కమిటీను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని మహిళలను లొంగదీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ రోజా తనను ఒక వ్యక్తి మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అసలు విషయంలోకి వస్తే.. నటిగా సినిమాలు చేయాలనుకున్న రోజాను జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.

సినిమాలో అవకాశాలు ఇప్పిస్తాననే నెపంతో ఆమెను లొంగదీసుకున్నాడు. తను మోసపోయానని తెలుసుకున్న ఈ యువతీ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కొందరు మహిళా జూనియర్ ఆర్టిస్టులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన రోజా అక్కడే శ్రీశాంత్ రెడ్డిపై చెప్పులతో దాడి చేసింది. అతడిని శిక్షించాలని మహిళా ఆర్టిస్టులంతా ఆందోలనకు దిగారు. 

loader