యువ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య టాలీవుడ్ లో కలకలం రేపింది. 21ఏళ్ళ నమో కరణ్ తన నివాసంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆయన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. న్యూ బోయిగూడకు చెందిన వనజ, మోహన్ లకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దవాడైన నమో కిరణ్ చిత్ర పరిశ్రమపై మక్కువతో జూనియర్ ఆర్టిస్ట్ గా మారాడు. 

ఓ యువతితో  తన ప్రేమ విఫలం కావడంతో నమో కిరణ్ మానసిక వేదనకు గురయ్యారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకొని మరణించడం జరిగింది. 

పని నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి వనజ తలుపు లోపలి నుండి లాక్ చేసి ఉండడాన్ని గ్రహించి, స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా నమో కిరణ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. ఆత్మ హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.