తెలంగాణా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో తెలుగు సినీ ప్రముఖులు కూడా పోటీ పడుతుండడంతో ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ముగ్గురు సెలబ్రిటీల మధ్య వార్ జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత తెలంగాణాలో తెలుగుదేశం హవా పూర్తిగా తగ్గిపోయింది. 

పేరుకైనా.. తెలుగుదేశం పార్టీని బ్రతికించాలని చేస్తోన్న ప్రయత్నాల్లో నందమూరి కుటుంబ వారసుడు కళ్యాణ్ రాం ని రాబోతున్న తెలంగాణా ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయించాలని పార్టీ అధినాయకత్వం కళ్యాణ్ రామ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకోస్తున్నారట.

ఈ విషయంలో కళ్యాణ్ రామ్ ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇదే స్థానం నుండి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ కూడా పోటీ చేయనున్నాడని సమాచారం.

వీరిద్దరూ చాలరన్నట్లు ఇదే స్థానంపై భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి జీవితా రాజశేఖర్ కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురు సినిమా సెలబ్రిటీల మధ్య ఎన్నికల ఫైట్ జరిగితేతెలంగాణా ఎన్నికల్లో ఇదొక హాట్ టాపిక్ గా మారుతుంది.