యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది ఉంది. గత ఏడాది ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో అభిమానులకు సూపర్ హిట్ అందించాడు. ప్రస్తుతం కొమరం భీం పాత్రలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సౌత్ లో వాణిజ్య ప్రకటనల్లో కూడా దూసుకుపోతున్నాడు. పలు కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులకు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

సౌత్ ఇండియా నుంచి 'ఓటీటీఓ' సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన తొలి నటుడు ఎన్టీఆరే కావడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే ఓటీటీఓ  ఉత్పత్తి అప్పీ ఫిజ్ వాణిజ్య ప్రకటనలో ఇటీవల ఎన్టీఆర్ నటించాడు. నార్త్ లో సల్మాన్ ఖాన్ ఈ యాడ్ లో నటిస్తున్నాడు. ఆ యాడ్ లోని ఓ బైట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సందర్భంగా క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ ఈ వీడియోలో టీం ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. అప్పీ ఫిజ్ ని ఎంజాయ్ చేస్తూ అంతా టీం ఇండియాకు సపోర్ట్ చేయాలని కోరాడు. ఎన్టీఆర్ కూల్ గా విష్ చేస్తున్న ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.