జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడికి నేను ఒక గెస్ట్ గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నాగార్జున గారిని నేను బాబాయ్ అంటాను. ఆయన నన్ను అబ్బాయ్ అంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరితో నాకు మంచి రిలేషన్ ఉంది. ముందుగా నిర్మాత ప్రసాద్ గారు ఒక మంచి వ్యామోహం ఉన్న నిర్మాత. ఎందుకంటే సినిమాను  మంచిగా తెరకెక్కించాలి అని ఆయన నిత్యం ఆలోచిస్తుంటారు. సంపాదించిన ప్రతి రూపాయికి మళ్ళీ చిత్ర పరిశ్రమకే అందిస్తుంటారు. అలాంటి నిర్మాత ఎప్పుడు బావుండాలని మిస్టర్ మజ్ను ఆయనకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా..

దర్శకుడు వెంకీ కూడా నాకు మంచి స్నేహితుడు. నేను ఇండస్ట్రీలోజి వచ్చినప్పటి నుంచి వెంకీతో నాకు పరిచయం. తొలిప్రేమ సినిమా చూసిన తరువాత కథనా బలంతో మొదటి విజయాన్ని చాలా అద్భుతంగా అందుకున్నాడు. అతను ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ మజ్ను కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఇక థమన్ కూడా మంచి సంగీతం అందించాడు.

ఇక ఫైనల్ గా నా తమ్ముడు అఖిల్ గురించి చెప్పాలి అంటే అతనికి ఉన్న ఒక మంచి గుణం గురించి చెప్పాలి. ఒక మనిషికి ఆత్మ విమర్శ చేసుకోవాలంటే చాలా దమ్ముండాలి. తనను తాను మార్చుకుంటూ. తన ఆలోచనను మార్చుకుంటూ వెళుతూన్నాడు... రాసి పెట్టుకోండి.. అఖిల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ గా నిలుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఆ రోజు వస్తుంది. ఆ రోజ