టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సతి సమేతంగా వచ్చి పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు. 

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సతి సమేతంగా వచ్చి పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు. మా ఇద్దరి వేళ్ళకు ఇన్క్ పడింది. మీరు కూడా ఓటు వేశారా? అని ఒక ఫోటో షేర్ చేస్తూ అందరూ ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. ఉదయాన్నే బన్నీ కూడా క్యూలో నిలబడి జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. 

తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు హైదరాబాదులో ఉన్నాయి. దీంతో ఆయన తన ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు. 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

View post on Instagram