టాలీవుడ్ ప్రయోగాత్మక పాత్రలకు రెడీ అయ్యే టాలీవుడ్ మాస్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌. జై లవ కుశ సినిమాలో విలన్‌గా నటించటమే కాకుండా నత్తితో ఇబ్బంది పడే వ్యక్తిగా కనిపించాడు ఎన్టీఆర్‌. కమర్షియల్ స్టార్‌గానే కాకుండా విలక్షణ నటుడిగానూ పేరు తెచ్చుకుంటున్న తారక్‌, ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆరు విభిన్న పాత్రల్లో నటించనున్నాడట ఎన్టీఆర్‌.

బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 6 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

బ్రిటీష్ వారికి కనబడకుండా తప్పించుకునే సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ లుక్స్‌ను ప్రత్యేకంగా ఫారిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌లతో డిజైన్ చేయించాడు జక్కన్న. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ నటిస్తోంది. డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.