నేడు టాలీవుడ్ లెజెండ్ యాక్టర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి 97వ జయంతి సందర్బంగా అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదట తెల్లవారు జామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. 

అయితే అక్కడికి రాగానే జూనియర్ పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. సమాధి దగ్గర ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. అక్కడ  చెత్త చెదారంతో ఉండడంతో కళ్యాణ్ రామ్ కూడా అసహనానికి గురయ్యారు. వెంటనే అనుచరులను పిలిపించి పువ్వులను తెప్పించారు. 

అభిమానుల సాహాయంతో ఘాట్ చుట్టూ అందంగా పూలతో అలంకరించారు. అనంతరం కొన్ని నిమిషాల వరకు మౌనంగా అక్కడే కూర్చున్న తారక్ ఇక నుంచి తాత వర్థంతి - జయంతి వేడుకలకు సంబందించిన ఏర్పాట్లను తానే చూసుకుంటాను అని చెప్పారు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న తారక్ రెండవ షెడ్యూల్ కి సంబందించిన పనులను నేడు మొదలుపెట్టనున్నాడు.