చరణ్ ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు.. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే!

Jr NTR shares a picture of Ram Charan
Highlights

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. వాళ్లు మాత్రమే కాదు ఇరు కుటుంబ సభ్యులు కలుసుకొని 

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. వాళ్లు మాత్రమే కాదు ఇరు కుటుంబ సభ్యులు కలుసుకొని వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. రాజమౌళి.. చరణ్-ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చేస్తున్నట్లు తెలిసినప్పటి నుండి వీరిద్దరి బంధంపై అభిమానుల ఫోకస్ మరింత పెరిగింది.

వాళ్లు కూడా కలిసి ఫోటోలు దిగుతూ అభిమానులతో పంచుకుంటూ వారి ఆనందానికి కారణమవుతున్నారు. తాజాగా తారక్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చరణ్ కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో చరణ్ పక్కన దివంగత నందమూరి తారక రామారావు ఫోటో ఉంది.

ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ''చరణ్ లెజెండరీ ఆలోచనల్లో ఉన్నారు'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్ రూపొందితోన్న 'అరవింద సమేత' సినిమాలో నటిస్తున్నారు. ఇక చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

 

loader