దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా.. కాలికి గాయమైంది. దీంతో షూటింగ్ కాస్త వాయిదా పడింది.

దాదాపు మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా వేశారు. చరణ్ కి గాయం తగ్గడంతో తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఈసారి మరో హీరో ఎన్టీఆర్ గాయపడినట్లుసమాచారం. కుడి చేతికి కట్టుతోఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ కి తగిలింది పెద్ద గాయం కాకపోవడంతో ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇవ్వలేదట. ఎప్పటిలానే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా అలియా భట్ కనిపించనుంది.

ఎన్టీఆర్ కి జోడీగా డైసీ ఎడ్గర్ అనే ఫారెన్ అమ్మాయిని తీసుకుంటే ఇప్పుడు ఆమె సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు రాజమౌళి.  డీవీవీ దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను  నిర్మిస్తున్నారు.