Asianet News TeluguAsianet News Telugu

అలా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూ. ఎన్టీఆర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ‌తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Jr NTR response on ntr health university name change
Author
First Published Sep 22, 2022, 2:54 PM IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వర్సిటీ పేరు మార్పు బిల్లకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం  కూడా తెలిపింది. హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కార్ ‌తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు. 

ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. 

 


ఇక, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్‌ నోట్ విడుదల చేశారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని తెలిపారు. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996 లో మరణించారని తెలిపారు.  ఎన్టీఆర్ మరణించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని అన్నారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మహా నాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ ఎన్టీఆర్ అని అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios