సినీతారలు కార్పొరేట్ సంస్థలతో పాటు క్రీడలకు కూడా ప్రచార కర్తలుగా మారుతున్నాయి. ఇండియాలో ఐపీఎల్, హాకీ లీగ్ తరహాలో ప్రో కబడ్డీ లీగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 7 అలరించేందుకు సిద్ధం అవుతోంది. 

ప్రో కబడ్డీకి తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ప్రో కబడ్డీ ప్రచారం కోసం ఎన్టీఆర్ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ వీడియోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'చూసే వాడికి అది ఆటే.. కానీ ఆడేవాడికి వేట', 'కబడ్డీ ఇది ఆట కాదు.. వేట' అంటూ ఎన్టీఆర్ చెబుతున్న పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ప్రో కబడ్డీలో ఆటగాళ్ల పోరాటం ఏస్థాయిలో ఉండబోతోందో జూ ఎన్టీఆర్ యాడ్ ద్వారా నిర్వాహకులు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి యూఎస్ వెళ్లడంతో షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.