తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు  నివాళులర్పించారు. ముందుగా ఎన్టీఆర్ మానవుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం 5.30 గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. 

జూనియర్ తో పాటు సోదరుడు కళ్యాణ్ రామ్ మరికొంత మంది అభిమానులు తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్ మీద పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు. కొన్ని నిముషాల వరకు అక్కడే కూర్చున్న ఎన్టీఆర్ పలువురు అభిమానూలు రాగ నమస్కరిస్తూ వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవ్వడంతో  చాలా మంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు.