కొన్ని కాంబినేషన్లు.. అనుకోకుండా అలా కలుస్తాయి. సడెన్ గా తెరమీదకు వస్తాయి. అభిమానులను అలరిస్తాయి. త్వరలో అలాంటి కాంబోనే టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 

గ్లోబల్ స్టార్.. క్రేజీ హీరో.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత రెండేళ్లు సీల్వర్ స్క్రీమీద కనిపించలేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ల లు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నాడు తారక్. అభిమానులకోసం తారక్ గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే వరుసగా కథలు వింటూ.. సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. 

ఇక తారక్ ఇప్పటికే తన 30వ సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు. ఆతరువాత కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నాడు ఎన్టీఆర్. దీనిలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ తెరకెక్కుతున్న ఈసినిమాలో కాజల్.. శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుస సక్సెస్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి స్టార్లతో సినిమాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

బాలయ్యతో సినిమా తరువాత ఎన్టీఆర్ తో మూవీ చేయాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా సమాచారం. అసలు అనిల్ పటాస్ సినిమా..ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథే అని తెలుస్తోంది. కాని అది కల్యాణ్ రామ్ కు అయితే బాగుంటుందని తారక్ సలహా ఇచ్చాడట. ఇక ఇన్నాళ్లకు ఎన్టీఆర్ కోసం ఆయన ఒక కథను రెడీ చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఇక చరణ్ కోసం ఆల్రెడీ ఒక లైన్ అనుకున్నాడని అంటున్నారు. అనిల్ దర్శకత్వంలో చేయాలనుకున్నట్టు గతంలో చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. 

అందువలన బాలకృష్ణ తరువాత సినిమాను ఎన్టీఆర్ చేసే దిశగా అనిల్ రావిపూడి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అలాగే చరణ్ కోసం అనుకున్న లైన్ కి పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని తీసుకురావడానికి కష్టపడుతున్నాడని అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ - చరణ్ అందుబాటులోకి రావడానికి ఆలస్యమైతే, అప్పుడు ఎఫ్ 4' ను సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉననట్టుసమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి.