కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్. వెళ్లిన దగ్గర నుంచి ఆధ్యంతం కన్నడ ప్రేక్షకుల మనసు దొచుకునేలా ప్రవర్తించారు. ఆయన సింప్లిసిటీ.. వినయానికి కర్నాటక ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే..? 

తన ప్రాణ మిత్రుడు, కన్నడ పవర్ స్టార్ దివంగత పునిత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది అయ్యింది. ఈ సందర్భంతో పాటు కర్ణాటక రాజ్యోత్సవం కూడా ఇదే టైమ్ లో రావడంతో.. పునిత్ రాజ్ కుమార్ కు కర్నాటక రత్న బిరుదు ప్రాధానం చేశారు. అయితే ఈ వేడుకలకు పునిత్ రాజ్ కుమర్ సన్నిహితులయిన సెలబ్రిటీలను అన్ని భాషల నుంచి ఆహ్వానించింది కన్నడ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్, తెలుగు నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆ వేడకుకలకు హాజరయ్యారు. 

ఇక ఈ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ వెంట్ స్టార్ట్ అయినప్పుటి నుంచీ జోరున వాన పడుతుండటంతో అతిథులకోసం వేసిన కుర్చీలు తడిసిపోయాయి. సరిగ్గా అదే సమయానికి అతిధులు కూర్చోడానికి రావడంతో... తడిసిన కూర్చీలను ఎన్టీఆర్ స్వయంగా తుడిచారు. అంతే కాదు ఒక కూర్చీ తుడిచి పునీత్ రాజ్‌ కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీని తుడిచి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని తారక్ కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Scroll to load tweet…

కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్, సుధామూర్తి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతిధులతో కలిసి కర్నాటక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కర్ణాటక రత్న పురస్కారాన్ని పునీత్ భార్య అశ్వినికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిదులతో అందరికన్నా ఎన్టీఆర్ ఎక్కువగా ఆకట్టుకున్నారు. తన స్పీచ్ అంతా కన్నడలోనే చేసిన తారక్. కర్నాటక ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. తారక్ స్పీచ్ విని అప్పు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. 

అంతకు ముందు స్పెషల్ ప్లైట్ లో బెంగళూరు వెళ్ళిన ఎన్టీఆర్ కు అక్కడి ఏయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. పునిత్ రాజ్ కుమార్ సన్నిహితులతో పాటు.. కర్నాటక ప్రభుత్వ అధికారులు తారక్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇక ఎన్టీఆర్, రజనీ కాంత్ లను కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ వేడుకలకు తనను అతిథిగా పిలవడం తనకు దగ్గిర గొప్ప గౌరవం అని ఎన్టీఆర్ అన్నారు. అప్పు తన ప్రాణ మిత్రుడని.. ఆయన కుటుంబం తనను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారన్నారు. కర్నాటక రత్నం బిరుదుకే అర్ధం తెచ్చిన గొప్ప మానవతా వాది పునిత్ రాజ్ కుమార్ అంటూ దివంగత హీరోపై ప్రశంసలు కురిపించాడు ఎన్టీఆర్.