యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబం నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా తిరుమలకు వెళ్లారు.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. 

మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని.. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ బిజీగా ఉండడం వల్ల తిరుమలకు వెళ్ళలేదు. 

అధికారులు వీరికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి క్యూట్ లుక్స్ ఎన్టీఆర్ అభిమానులని, నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఎన్టీఆర్ పిల్లలు ఎప్పుడు కనిపించినా వారి పిక్స్ ఇంటర్నెట్ లో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులంతా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ దేశ విదేశాల్లో ఎన్టీఆర్ అభిమానుల హంగామా ఎక్కువవుతోంది.