రిలీజ్ కు ఇంకా రెండునెలలు కూడా లేదు.. దేవర షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయినా సరే టీమ్ ప్రశాంతంగా ఉన్నారు. పక్కాగా అనుకున్న టైమ్ కు రిలీజ్ చేస్తాం అన్నధీమాగాఉన్నారు. కారణం ఏంటి..? అసలు దేవర షూటింగ్ డిలేకి కారణం ఎవరు..?
ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ టాకీ పార్ట్ ఇంకా పూర్తి కాలేదు. న్యూ ఇయర్, సంక్రాంతిలాంటికారణాలతో తారక్ దాదాపు 20 రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇక తాజాగా ఈమూవీ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి కొన్ని పాచ్ వర్క్స్ తో పాటు.. మిగిలి ఉన్న టాకీ పార్ట్ ను ఈషెడ్యూల్ తో కంప్లీట్ చేస్తారట టీమ్. అయితే ఇక్కడ మరోట్విస్ట్ ఏంటంటే.. ఈమూవీ సాంగ్స్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని తెలుస్తోంది. అయినా సరే టీమ్ కాన్ఫీడెంట్ గా ఉన్నారట. ఎందుకో తెలుసా..?
ఈసినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే తమిళసినిమాల వల్ల ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవర సాంగ్స్ ను ఇంకా అందించలేదని తెలుస్తోంది. అయితే అనిరుథ్ లేట్ అయినా.. మంచి ట్యూన్స్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నారు దేవర బ్యాచ్. అందుకే అనిరుధ్ ను కదిలించడంలేదు. కాని అతను సాంగ్స్ ఇస్తే.. షూటింగ్ ను కంప్లీట్ చేసే అవకాశం ఉంటుది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ట్యూన్స్ ఇవ్వగానే.. షూటింగ్ కు వెళ్లి.. కంప్లీట్ చేసి..ఎడిటింగ్ పూర్తి చేసి.. సినిమాలో యాడ్ చేయాలి.. పెద్దపనే..... అయినా సరే అనుకున్న టైమ్ కు కంప్లీట్ అవుతుంది అన్నధైర్యంతో ఉన్నారుటీమ్.

వారం రోజుల పాటు అల్యూమీనియం ఫ్యాక్టరీలో దేవర షెడ్యూల్ జరగనుంది. ఎప్రిల్ 5న విడుదల కాబట్టి.. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో బానే ఉండబోతున్నాయి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైమ్ ఎక్కువ కావాలి. అయితే అనిరుధ్ కారణంగా సాంగ్స్ షూట్ ఆలస్యమవుతుందని తెలుస్తుంది. అతను సాంగ్స్ ఇవ్వడం లేట్ అవుతుంది అందుకే ముందు టాకీ పూర్తి చేసి.. ఆ తర్వాత సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు.
ఎలా చూసుకున్నా.. ఎప్రిల్ 5న దేవర పార్ట్ 1 రావడం మాత్రం ఖాయం అంటున్నారు మేకర్స్. చూడాలి ఇంత ధైర్యంగా ఉన్న మూవీ టీమ్.. ఎంత వరకూ పని ఫినిష్ చేస్తుందో..? అటు తారక్ కూడా అనిరుధ్ మ్యూజిక్ పై నమ్మకంతో ఉన్నాడట. కాస్త లేట్ అయినా.. అనిరుధ్ ను కదిలించవద్దని టీమ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ.
