రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బ్రిటిష్ కాలం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అయినప్పటికీ ఇది కేవలం కల్పిత గాధ మాత్రమే. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఇద్దరు రియల్ హీరోస్ ని రాంచరణ్, ఎన్టీఆర్ రూపంలో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. 

మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించే సమయంలో ఓ సమస్య ఉంటుంది. దర్శకుడు ఇద్దరు హీరోల పాత్రకు న్యాయం చేయాలి. రాజమౌళి ఎంచుకున్నది ఇద్దరు వీరుల కథ కాబట్టి అభిమానులు సగం ఇక్కడే సంతృప్తి చెందారు. ఇక సినిమా ఎలా ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టేశారు. పోటాపోటీగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానుల మధ్య పోటీ పెరిగితే సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని రాజమౌళి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయంలో రాజమౌళి ఇద్దరు హీరోలని ఇప్పటికే హెచ్చరించాడట. అభిమానుల ని కంట్రోల్ చేసేలా ఏదైనా చేయాలని సూచించినట్లు ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.