తాతను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్.  పెద్దాయన శతజయంతి సందర్భంగా తారక్  తాతను తలుచుకున్నారు. సదా స్మరించుకుంటూ అంటూ ట్వీట్ చేశారు. కల్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించారు.  


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తరకరామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో తమ అభమాన నాయకుడు,నటుడు దేవుడిని కొలుస్తున్నారు ప్రజలు. అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ గా కూడా తారకరాముని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ కు ప్రముఖులు బారులు తీరుతున్నారు. 

మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా .. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ.. తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో శతజయంతి వేడుకలను ప్రారంభించారు. నిన్న సాయంత్రమే నిమ్మకూరు చేరుకున్న బాలయ్య ఈ ఉదయం గ్రామంలోని దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం తన తండ్రి,తల్లి విగ్రహాలకు నివాళి అర్పించారు. అటు నుంచి తెనాలి వెళ్లనున్న బాలయ్య అక్కడ పెమ్మసాని థియేటర్ లో ఏడాది పాటు ప్రదర్శించే ఎన్టీఆర్ సినిమాలను ప్రారంభించనున్నారు.