Asianet News TeluguAsianet News Telugu

నా కెరీర్ కి అదే మైనస్, బరువు కాదు..ఎటెళ్ళాల్లో తెలియక నాలుగేళ్లు నరకం, మనసులో బాధ బయటపెట్టిన జూ.ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. తొలిరోజు ఈ చిత్రం 170 కోట్లకి పైగా రికార్డ్ ఓపెనింగ్ సాధించింది అని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Jr NTR about his career struggles and flop movies dtr
Author
First Published Sep 29, 2024, 10:19 AM IST | Last Updated Sep 29, 2024, 10:19 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. తొలిరోజు ఈ చిత్రం 170 కోట్లకి పైగా రికార్డ్ ఓపెనింగ్ సాధించింది అని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే దేవర చిత్రం పెద్ద హిట్ అయినట్లే. కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ విజువల్ ఫీస్ట్ గా ఎమోషనల్ యాక్షన్ డ్రామా తెరకెక్కించారు. 

వరుస హిట్లతో ఎన్టీఆర్ జోరు 

సెకండ్ హాఫ్ విషయంలో ఆడియన్స్ కొందరు పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ వల్ల అది ఇబ్బంది కాలేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గత కొన్నేళ్ళుగా పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. నాన్నకు ప్రేమతో, టెంపర్, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస విజయాలు సాధించారు. ఇప్పుడు ఈ ఖాతాలోకి దేవర కూడా చేరింది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడున్న పరిస్థితి గతంలో లేదు. కొన్నేళ్ల పాటు తారక్ హిట్ లేకుండా సతమతమయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్ కి పెద్ద మైనస్ గా మారిన అంశాన్ని కూడా రివీల్ చేశారు. 

అదే నా కెరీర్ కి మైనస్ అంటున్న ఎన్టీఆర్ 

సింహాద్రి వరకు ఎన్టీఆర్ కెరీర్ ఉవ్వెత్తున ఎగసింది. నా కెరీర్ కి అది ప్లస్సా మైనస్సా తెలియదు.. చాలా చిన్న వయసులోనే నాకు సూపర్ స్టార్ డమ్ వచ్చేసింది. సింహాద్రి తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాలేదు. దీనితో నాలుగేళ్ళ పాటు దారుణమైన ఫ్లాపులు పడ్డాయి. సింహాద్రి, యమదొంగ మధ్యలో ఒక్క హిట్ కూడా లేదు. రాఖి అనే చిత్రంలో నా నటనకి మంచి పేరు వచ్చింది కానీ.. సినిమా కమర్షియల్ గా హిట్ కాదు. ఆ నాలుగేళ్లు పిచ్చెక్కినట్లు అయింది. మైండ్ కూడా సరిగ్గా పనిచేయలేదు. ఒకరకంగా నరకం చూశా. 

Jr NTR about his career struggles and flop movies dtr

ఎక్కడ తప్పు జరుగుతోంది అని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి సినిమాలో నరకడాలు, చంపడాలు, రొటీన్ ఫైట్స్ ఉండకూడదు అనుకున్నా. అప్పుడే నాలో మార్పు మొదలయింది అని ఎన్టీఆర్ తెలిపారు. స్టూడెంట్ నంబర్ 1 పక్కన పెడితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఎక్కువగా గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పడం, నరకడం లాంటివే ఉంటాయి. యమదొంగ నుంచి అంది మారింది అని ఎన్టీఆర్ తెలిపారు. భవిష్యత్తులో కాలేజ్ కి వెళ్లే కుర్రాడిలా కూడా నటిస్తానేమో అంటూ ఎన్టీఆర్ సరదాగా తెలిపారు. 

మరోసారి ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో.. 

ఇప్పుడు దేవర చిత్రంలో కూడా నరకడాలు చంపడాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ.. విజువల్స్, విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ. నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆది, సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1 లాంటి చిత్రాలు ఎన్టీఆర్ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ స్థాయి పాన్ ఇండియా వైడ్ గా రికార్డు ఓపెనింగ్స్ సాధించే వరకు చేరింది. 

Also Read: బాలయ్య ఒకవైపు, చిరంజీవి మరో వైపు.. ఇప్పుడు వద్దని ప్రభాస్ చెప్పినా వినలేదు, కుంభస్థలాన్ని బద్దలు కొట్టారు

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవర చిత్రం రెండో మూవీ. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అక్కర్లేదు అనే పాయింట్ తో  సముద్రం బ్యాక్ డ్రాప్ లో దేవర కథ రాసుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. 

పాన్ ఇండియా మార్కెట్ పై ఎన్టీఆర్ గురి.. 

దేవర చిత్రం అనుకున్న విధంగా భారీ వసూళ్లు సాధిస్తే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ పదిలం అయినట్లే. దేవర చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా సముద్రంలో షార్క్ సన్నివేశం కోసం తారక్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నీళ్ళల్లోకి వస్తూ వెళుతూ ఉండాల్సి వచ్చేదట. ఆ సన్నివేశాలు అంత అద్భుతంగా రావడం వెనుక డైరెక్టర్ కొరటాలతో పాటు చాలా మంది టెక్నీషియన్లు కష్టపడ్డారని ఎన్టీఆర్ తెలిపారు. 

Jr NTR about his career struggles and flop movies dtr

ఎన్టీఆర్ తదుపరి వార్ 2లో హృతిక్ రోషన్ తో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది భారీ మల్టీస్టారర్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవల ప్రారంభం అయింది. మరి దేవర 2 ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. సెకండ్ పార్ట్ కి లీడ్ గా దేవర 1 క్లైమామ్స్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios