Asianet News TeluguAsianet News Telugu

తగ్గేదే లే.. పుష్ప 2 కోసం జానీ మాస్టర్ కి ఫోన్ చేసి మరీ ఒత్తిడి పెంచుతున్న అల్లు అర్జున్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది.

johnny master interesting comments on Allu Arjun Pushpa 2 dtr
Author
First Published Jun 5, 2023, 9:40 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. సినిమాపై ప్రారంభంలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ లో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.  పుష్ప మొదటి భాగంలో బన్నీ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ మాటనే పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ప్రతి అంశంలో పాటిస్తున్నారు. ఆయా క్రాఫ్ట్స్ కి సంబంధించిన వారిని ముందే హెచ్చరిస్తున్నారు. 

తాజాగా పుష్ప 2పై జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. పుష్ప 2 లైన్ సూపర్ గా ఉంది. సుకుమార్ గారి టేకింగ్ గురించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ గురించి ఇక చెప్పేదేముంది. దేవిశ్రీ ప్రసాద్ రెండవ భాగానికి కూడా సాలిడ్ మ్యూజిక్ ఇస్తారు. 

కొన్ని రోజుల ముందు అల్లు అర్జున్ గారు నాకు ఫోన్ చేసి మనం పుష్ప 2 కోసం వర్క్ చేయాలి. ఇంతకు ముందెప్పుడూ చేయని విధంగా చేయాలని అనుకుంటున్నా' అని అన్నారు. ఈ మాటల బట్టే అర్థం చేసుకోవచ్చు.. బన్నీ పుష్ప 2 కోసం ఎంత డేడికేట్ గా ఉన్నారో అని. కేవలం డ్యాన్స్ పైనే బన్నీ ఇంత ఫోకస్ పెడుతుంటే.. ఇక యాక్షన్ సీన్స్, ఇతర కీలక సన్నివేశాలపై బన్నీ ఏ రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడో అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios