తమిళ స్టార్ హీరో తలా అజిత్ నటించిన వేదాలం చిత్రం ఘనవిజయం సాధించింది. శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు అన్ని భాషల్లో మంచి డిమాండ్ నెలకొని ఉంది. ఇటీవల బాలీవుడ్ లో సౌత్ చిత్రాల రీమేక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సింబా లాంటి చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

బాలీవుడ్ క్రేజీ హీరో జాన్ అబ్రహం వేదాలం రీమేక్ పై కన్నేశాడు. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించే వేదాలం చిత్రంలో జాన్ అబ్రహం సెట్ అవుతాడా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ కథలో మార్పులు చేసి రీమేక్ చేసే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వేదాలం చిత్ర హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. 

ఈ చిత్ర కథ ఎంతగానో నచ్చడంతో జాన్ అబ్రహం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, ఇతర నటీనటుల వివరాలు అన్నీ త్వరలో తెలియనున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయాలని భావించి ఆ ఆలోచనని విరమించుకున్నారు.