బిగ్ బాస్ హౌస్ లో రీయూనియన్ కహాని మొదలైంది. హౌస్లోకి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు. నిన్న మోనాల్, లాస్య, కరాటే కళ్యాణి మరియు కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. ఫైనల్ కి ముందు రోజైన నేటి ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్స్ నోయల్, అవినాష్, మెహబూబ్, దివి రావడం జరిగింది. నోయల్ తన రాప్ తో జోష్ నింపగా, అవినాష్ తన మార్కు కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించారు.

ఇక హాట్ డ్రెస్ లో మెహబూబ్ తో హౌస్ లోకి వచ్చిన దివి సెక్సీగా ఉంది. వీరిద్దరూ 'నీతోనే డాన్స్ టునైట్' సాంగ్ కి రొమాంటిక్ స్టెప్స్ తో అలరించారు. కాగా వీరితో పాటు గంగవ్వ మరియు జోర్దార్ సుజాత రావడం జరిగింది. గంగవ్వను చూసిన అఖిల్ మరియు సోహైల్ సంతోషపడ్డారు. గంగవ్వ ఇంటిలోకి వచ్చింది కథ వేరే ఉంటదని సోహైల్ అరిచాడు.

అయితే గంగవ్వ, జోర్దార్ సుజాత ఇంటి సభ్యుల ముందే వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ కొట్టుకొనే ప్రయత్నం చేశారు. గ్లాస్ అడ్డుగా ఉండడంతో ఈ గొడవను ఇంటి సభ్యులు ఆపలేకపోయారు. మరి వీరిద్దరూ గొడవ పడడానికి కారణం ఏమిటో పూర్తి ఎపిసోడ్ చూస్తే కాని అర్థం కాదు. ఇక అరియనా, సోహైల్, అభిజీత్, అఖిల్ మరియు హారిక ఫైనల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఐదుగురు ఫైనలిస్ట్స్ నుండి ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు.