Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 20వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

ఈరోజు ఎపిసోడ్ లో జానకి చెయ్యి కడుక్కోవడానికి వెళ్లగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏమైంది జానకి అని అంటుంది జ్ఞానాంబ. ఏం లేదు అత్తయ్య అని జానకి అనడంతో వెంటనే వెన్నెల మనం ఆ ఇండ్లు ఖాళీ చేయడానికి రెండు రోజుల ముందు నుంచి వదిన కంటినిండా నిద్రపోలేదమ్మా అన్నయ్యకి సహాయం చేసి రాత్రంతా మేలుకొని చదువుకుంటూ మళ్లీ పొద్దున లేచి వంటలు చేస్తూ సరిగా నిద్రపోవడం లేదు అందుకే ఇలా అనిపించింది అని అంటుంది. సరే చేయి కడుక్కో అనగా జానకి చెయ్యి కడుక్కునే అక్కడి నుంచి వెళ్ళిపోగా నీరసంగా ఉంది అంటే ఏదైనా విశేషమేమో అనుకుంటూ ఉంటుంది జ్ఞానాంబ.

ఆ తర్వాత జానకి బయట కూర్చుని చదువుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అనగా చదువుకుంటూ పైకి లేయాల్సిన అవసరం లేదు కూర్చో అని అంటుంది. ఎప్పుడు చదువే కాదు నీ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఒకవైపు చదువుకుంటూ మరో వైపు ఆ పని చేయాలంటే కష్టమే కదా అనడంతో చదువుని ఇష్టంగా చదువుతున్నాను ఇంట్లో పని చేయడం నా బాధ్యత అత్తయ్య అని అంటుంది. చదువు ఇష్టమే కాదనను కానీ పగలంతా కష్టపడి రాత్రంతా చదివితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటుంది జ్ఞానాంబ. నా ఆరోగ్యానికి ఏం కాలేదు అత్తయ్య అనగా మీ అమ్మ లేకపోయినా మీ అమ్మలా చూసుకునే అత్తయ్యను ఉన్నాను.

ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని అంటుంది జ్ఞానాంబ. నాకు ఎటువంటి బాధలు లేవు నాకు ఏదైనా బాధ వస్తే మీకు కాకుండా నేను ఎవరికి చెప్తాను అంటుంది జానకి. రేపు ఉదయాన్నే మనమ హాస్పిటల్ కి వెళ్తున్నాము రెడీగా ఉండు అనగా నాకేం కాలేదు అత్తయ్య గారు అనడంతో ఆ విషయం చెప్పాల్సిన నువ్వు కాదు డాక్టర్ గారు రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మల్లిక చిన్న అత్తయ్య గారు అంటూ తిలోత్తమ్మ దగ్గరికి వెళ్తుంది. నేను మీ గురించి వెతుకుతున్నాను మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రండి మీ గది చూపిస్తాను అని అనడంతో వస్తాను కానీ డాన్స్ వేసి కాలు నొప్పి పెడుతున్నాయి కాలు నొక్కు అనడంతో మల్లిక ఆశ్చర్య పోతుంది.

 నేనా అనగా ఎదురుగా ఉంది నువ్వే కదా నిన్నే వచ్చి కాలు నొక్కు అనడంతో నేనా ఇంతవరకు మా అత్తయ్య గారి కాళ్ళే పట్టలేదండి అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక తప్పక వెళ్లి తిలోత్తమ కాలు నొక్కుతూ ఉండగా చాలా అత్తయ్య గారు అనడంతో ఈ పూటకు చాలు ప్రతిరోజు అర్థగంటసేపు నా కాలు నొక్కాలి అని అంటుంది తిలోత్తమ. ఆ తర్వాత రామచంద్ర సంతోష పడుతూ అమ్మ మన గురించి పట్టించుకోనట్టే ఉంటుంది కానీ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని అనడంతో జానకి కూడా అవును రామచంద్ర గారు అని అంటుంది. అత్తయ్య గారు అలా వచ్చి మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండీ అంటుంది. అప్పుడు జానకి మనం ఆ ప్రకాశం నుంచి కొంత డబ్బు తీసుకొని ఇల్లు విడిపించుకున్నాము. 

మిగిలిన డబ్బు కూడా తీసుకొని ఆ షాప్ ని విడిపించుకుందాం అని అంటుంది. అవునండి వాడి గురించి చెప్పడం మర్చిపోయాను వాడు ఇంక నా దగ్గర డబ్బులు లేవు. నాలాగే నన్ను ఇంకొకడు మోసం చేశాడు అంటున్నాడు అని రామచంద్ర అనడంతో అప్పుడు జానకి సీరియస్ అవుతూ ఏం తమాషాలు చేస్తున్నాడో అసలు వాడు ఎక్కడ ఉన్నాడు అనడంతో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీసులు కూడా వాడి దగ్గర నుంచి డబ్బులు రాబట్టడం కష్టమే అంటున్నారు అనడంతో జానకి ఆశ్చర్యపోతుంది. వాళ్ళేదో అన్నారని మీరు వదిలేస్తారా పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో గరిట పట్టుకొని రూపాయి రూపాయి సంపాదించిన సొమ్ము అండి అది అలా ఎలా వదిలేస్తారు అంటుంది జానకి.

జానకి టెన్షన్ పడుతూ ఉండగా మీరేం బాధపడకండి ఆ విషయాలు నేను చూసుకుంటాను మీరు ఆరోగ్యం పై చదువు మీద శ్రద్ధ పెట్టండి చాలు అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి చెప్పిన వినిపించుకోకుండా జానకి చేతిలో బుక్కు పెట్టి చదువుకోమని చెప్తూ ఉంటాడు. జానకి చదువుకుంటూ ఉండగా టవల్ తో గాలి విసురుతూ ఉంటాడు రామచంద్ర. మరుసటి రోజు ఉదయం గోవిందరాజులు గడియారం చెక్ చేస్తూ ఉండగా ఇంతలోనే తిలోత్తమా అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు తిలోత్తమని చూసి ఈ సాంగ్ వేసుకొని సిగ్గు పడుతూ ఉంటాడు గోవిందరాజులు. ఇంతలోని జ్ఞానాంబ అక్కడికి వచ్చి గోవిందరాజుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు జ్ఞానాంబ మాటలకు సిగ్గుపడుతూ ఉంటాడు.

ఆ తర్వాత రామచంద్ర ముఖానికి అంతా మసి పూసుకొని మీ అక్క ఎక్కడ జెస్సి అనడంతో జెస్సి నవ్వుకుంటూ పిలుస్తాను బావగారు అంటూ జానకిని పిలుస్తుంది. జానకి అక్కడికి వచ్చి నవ్వుకుంటూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ కూడా అక్కడికి వచ్చి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో తిలోత్తమా కూడా అక్కడికి వచ్చి ఏంటి రామా పౌడర్ పూసుకొని బదులు మసి పూసుకున్నావు అనడంతో రామచంద్ర బుంగమూతి పెట్టుకుంటాడు. అప్పుడు నీ సంగతి చెప్తాను రా మలయాళం కి వెళ్తాడు రామచంద్ర. తర్వాత జ్ఞానాంబ, జానకి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగా మా జానకీ చాలా నీరసంగా ఉంది ఒకసారి చెక్ చేయండి అని అంటుంది. అప్పుడు డాక్టర్ మీ కోడలు గారిది మీరు అనుకుంటున్న నీరసం కాదు సరిగ్గా నిద్ర తిండి లేక వచ్చిన నీరసం అని అంటుంది.

అప్పుడు జ్ఞానాంబ లోపల నిరాశ పడుతూ బయటకు మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ వాళ్లు నడుచుకుంటూ బయటకు వెళుతుండగా ఇంతలోనే జ్ఞానాంబకు కళ్ళు తిరగడంతో ఏమైంది జ్ఞానాంబ గారు కళ్ళు తిరగడం ఏంటి కొన్ని మీకు టెస్టులు చేయించాలి అని అంటుంది డాక్టర్. ఆ తర్వాత అఖిల్ ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతుండగా ఇంతలోనే గోవిందరాజులు అక్కడికి వచ్చి ఆఫీస్ కి వెళ్ళాలి అని బయటికి వెళ్తుండగా చెప్పు తెగిపోతుంది. అప్పుడు గోవిందరాజులు చెప్పు తెగిపోయింది అనుకుంటున్నాగా ఇంతలోనే జెస్సి అక్కడికి వచ్చి కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా మామయ్య గారు అనడంతో మా నాన్న కొత్త చెప్పులు కొనుక్కోవాలి అంటే ఒకటి తెగిపోవాలి లేదా పోవాలి..

అనగా వెంటనే గోవిందరాజులు సెటైర్ వేస్తూ నాకు నీలాగా 15వేలు జీతం కాదు కదా దాంతో అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జెస్సి సరే వచ్చేటప్పుడు మామయ్య గారికి చెప్పులు తీసుకుని రా అనగా వద్దమ్మా ఆ15 వేలలో ఖర్చులకి ఆటోలకి ఎన్ని ఖర్చులు ఉంటాయి అని పదేపదే 15వేలు గురించి మాట్లాడుతూ ఉండగా ఆలోచనలో పడతాడు.