Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 15వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ కుటుంబం మళ్లీ పాత ఇంటికి రావడంతో అది చూసి అందరూ సంతోషపడుతూ ఉండగా మల్లిక మాత్రం మళ్లీ జైల్లోకి వచ్చి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ సంతోషంగా లోపలికి వెళ్తారు. గోవిందరాజులు ఇదిగో కొడుకు కోడళ్ళు అందరూ కలిసి ఇంటిని శుభ్రం చేయండి అని అనడంతో మల్లిక ఒకమంతా ఒకలాగా పెడుతుంది. అప్పుడు మల్లిక తలబాదుకుంటూ మళ్లీ ఇంటికి వచ్చాము అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన జ్ఞానాంబ దేవుడి విగ్రహాలను శుభ్రం చేస్తూ ఉంటుంది. అదిచూసి రామచంద్ర జానకి సంతోష పడుతూ ఉంటారు.
తర్వాత అందరూ కలిసి సరదాగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. మరోవైపు మల్లిక పనిచేయకుండా ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలో విష్ణు మల్లిక కోపం చీపురు తీసుకుని వస్తాడు. అప్పుడు జ్ఞానాంబ గట్టిగా మల్లిక అనడంతో చేస్తున్నాను అత్తయ్య గారు అంటూ ఏదో లైట్ గా చేస్తూ ఉంటుంది. మరోవైపు జానకి రామచంద్ర వాళ్ళ రూం ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అమ్మ నడుము నొప్పిస్తోంది అని మల్లిక ఒకచోట కూర్చోగా ఇంతలో విష్ణు ఇల్లు తుడువు అని చెప్పి బకెట్ ఇచ్చి వెళ్తాడు. అప్పుడు మల్లిక తుడుస్తూ ఉండగా కాలుజారి వెనక్కి పడుతుంది. అప్పుడు విష్ణు అక్కడికి వచ్చి మల్లిక మీద సెటైర్స్ వేస్తు కూర్చున్నట్టు కాదు వెళ్లి పని చేస్తావా లేక అమ్మని పిలవాలా అని అంటాడు.
అప్పుడు మల్లిక విష్ణు తో వాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరూ ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా మీ చీరకు రంగు అంటింది అంటూ రామచంద్ర రొమాంటిక్ గా ఆ రంగుని తుడుస్తూ ఉంటాడు. అప్పుడు జానకి నేను ప్రపోజ్ చేస్తే వద్దని చెప్పారు కదా ఇప్పుడు ఆ సంతోషం దక్కిందా అనడంతో చాలా బాగా దక్కింది థాంక్స్ జానకి గారు అనగా ఒట్టి థాంక్స్ మాత్రమే కాదు హగ్ ఇచ్చి ముద్దు పెట్టాలి అంటుంది జానకి. అప్పుడు మీరు ముద్దు పెడతారా లేక నేను పెట్టాలా అనడంతో నేనే పెడతాను అని అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర ముద్దుపెట్టి జానకికి హగ్ ఇచ్చే ఐ లవ్ యు చెప్పడంతో జానకి సంతోష పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత అందరూ వెళ్లి శుభ్రం చేయడం అయిపోవడంతో అందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ ఎవరికన్ను పడిందో ఎవరి దిష్టి పడిందో వీధిన పడ్డాము మాటలు కూడా పడ్డాము. మాటలు పడడంతో పాటు సొంత ఇంటిని కూడా వదులుకోవాల్సి వచ్చింది అని బాధగా మాట్లాడుతుంది. మళ్లీ ఇటువంటి పరిస్థితి రాకూడదని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటుంది జ్ఞానాంబ. మీ అందరితో వేరు వేరు కాపురాలు పెట్టించాలనుకుంటున్నాను అనడంతో జానకి రామచంద్ర షాక్ అవుతారు. అప్పుడు మల్లిక వాళ్ళు సంతోష పడుతూ ఉండగా విష్ణు వాళ్ళు షాక్ అవుతారు.
అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నాం ఎవరెవరి జీవితాలు వాళ్ళవి మీ జీవితాలు మీరే తీసుకోండి ఎవరికి ఇవ్వాల్సిన పనిలేదు అనడంతో అఖిల్,మల్లిక వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. రామచంద్ర ఏంటమ్మా ఈ నిర్ణయం అని అంటాడు అందరూ కలిసే ఉందామని అనడంతో అవును అత్తయ్య గారు అంటుంది జానకి. మీ నిర్ణయాన్ని మార్చుకోండి అత్తయ్య గారు అనడంతో ఇది ఫైనల్ అని అంటుంది. వారం అంతా ఎవరికి కాపురాలు వారివి వారం తర్వాత అందరూ కలిసి ఒకసారి భోజనం చేయాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. అప్పుడు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రామచంద్ర జానకి ఆలోచనలో పడతారు.
