జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన హీరో ధనుష్, ఆ 40 నిమిషాలు అంటూ.

తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యింది జిగర్తాండా డబుల్ ఎక్స్. ఈమూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆ 40 నిమిషాలు అంటూ.. ఆయన ఇచ్చిన రివ్యూ అద్భుతంగా ఉంది. మరి ధనుష్ ఏమంటున్నారంటే..? 
 

Jigarthanda DoubleX  Movie Hero Dhanush  First Review JMS

కోలీవుడ్ స్టార్స్.. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జిగర్తాండా డబుల్ఎక్స్. తమిళ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్  తెరకెక్కించిన ఈ సినిమా.. 9 ఏళ్ల క్రితం అంటే..  2014లో వచ్చి సూపర్ హిట్ అయిన జిగర్తాండాకు సీక్వెల్‌గా  తెరకెక్కింది. అది జిగర్తాండా అయితే.. ఇది డబుల్ఎక్స్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే  ఈమూవీ ఎలా ఉంది.. ఎంత వరకూ వర్కౌట్ అయ్యింది. అనే విషయాలు వెల్లడిస్తూ..  ఫస్ట్ రివ్యూని ఇచ్చారు.. తమిళ స్టార్ హీరో  ధనుష్. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..? 

జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీని ఆకాశానికి ఎత్తేశారు ధనుష్. సినిమా గురించి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లో ధనుష్ ‘జిగర్తాండా డబుల్ఎక్స్ చూశాను. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని చాలా బాగా తీశారు. అద్భుతంగా నటించడం ఎస్‌జే సూర్యకు అలవాటై పోయింది. ఒక నటుడిగా ఇది రాఘవ లారెన్స్‌కు మరో పార్శ్వం. సంతోష్ నారాయణన్ సంగీతం అదిరిపోయింది.  అని అన్నారు ధనుష్. అంతే కాదు..  చివరి 40 నిమిషాలు ఈసినిమా  మీ మనసులు దోచుకుంటుంది. టీమ్ అంతటికి  ఆల్ ది బెస్ట్ చెప్పారు ధనుష్. 

అయితే ఈ సినిమాకు ధనుష్ రివ్యూ ఇవ్వడానికి కారణం ఉంది. గతంలో ధనుష్,  కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో జగమే తంత్రం  సినిమా వచ్చింది. అయితే  నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది సినిమా. కాని  ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. నెగెటీవ్ రివ్యూలు వచ్చినా..  ఇది తన మనసుకు నచ్చిన సినిమా అని ధనుష్ ఎన్నో సందర్భాల్లో అన్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఎడిటింగ్ కారణంగా సినిమా ఫ్లాప్ అయిందని, ఉపయోగించని సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయని కార్తీక్ సుబ్బరాజ్ కూడా అప్పట్లో క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ అనుబంధం అప్పటి నుంచి ఉండటంతో.. కార్తీక్  సినిమాకు బూస్టఫ్ ఇచకచారు ధనుష్. 

ఇక ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. 1975 నాటి కాలం నాటి కథతో ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ తీశారు. ఒక దర్శకుడు సినిమా తీయాలనుకోవడం, అందులో గ్యాంగ్‌స్టర్ హీరోగా నటించడం నేపథ్యంలో కథ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

2014లో వచ్చిన ‘జిగర్తాండా’ తమిళంలో పెద్ద హిట్ అయింది. నెగిటివ్ రోల్‌లో నటించిన బాబీ సింహా ఏకంగా జాతీయ అవార్డు కూడా సాధించాడు. ఈ సినిమాను తెలుగులో అధర్వ, వరుణ్ తేజ్‌లతో ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేశారు. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో విడుదల అయిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios