జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్.. శ్రీదేవిని గుర్తు చేస్తోంది!

jhanvi kapoor on vogue magazine cover page
Highlights

దివంగత నటి శ్రీదేవి నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది

దివంగత నటి శ్రీదేవి నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది అందాల తార జాన్వీ కపూర్. మొదటి సినిమానే నటనకు ప్రాధాన్యమున్న కథను ఎన్నుకుంది. జూలై నెలలో 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది.

తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ మ్యాగజైన్ 'వోగ్' ఫోటో షూట్ లో పాల్గొంది. ఆమె ముఖచిత్రంతో కూడిన కవర్ పేజీను విడుదల చేశారు. ఫ్లోరల్ డిజైనర్ వేర్ లో అమ్మడు తలుక్కుమంది. జాన్వీను ఈ లుక్ లో చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆమె తొలి కవర్ షూట్ ఇదే కావడం విశేషం. ఈ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఎంతో ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నట్లు రాసుకొచ్చింది.  

loader