MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్

ఏళ్ల తరబడి వాయిదాలు, సెన్సార్ కష్టాలు దాటుకుని దిల్జిత్ దోసాంజ్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'సట్లజ్' అనే కొత్త పేరుతో విడుదలైన ఈ చిత్రం, మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా కథను తెరపైకి తెచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 04 2026, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పేరు మార్చేసి ఓటీటీలో రిలీజ్
Image Credit : Asianet News

పేరు మార్చేసి ఓటీటీలో రిలీజ్

చాలా కాలం నిరీక్షణ, సెన్సార్ ఇబ్బందుల తర్వాత దిల్జిత్ దోసాంజ్ వివాదాస్పద చిత్రం 'పంజాబ్ 95' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. అయితే, ఈ సినిమా ఇప్పుడు 'సట్లజ్' పేరుతో జీ5 (Zee5)లో స్ట్రీమ్ అవుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా, సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేశారు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RSVP, మక్‌గఫిన్ పిక్చర్స్ నిర్మించాయి. ఇందులో దిల్జిత్ దోసాంజ్‌తో పాటు అర్జున్ రాంపాల్, కన్వల్జిత్ సింగ్, సువిందర్ విక్కీ, గీతికా విద్యా ఓహ్లాన్ నటించారు. సెన్సార్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి ఆగిపోయింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
25,000కు పైగా మిస్సింగ్ కేసులు
Image Credit : instagram

25,000కు పైగా మిస్సింగ్ కేసులు

ఈ 'సట్లజ్' సినిమా జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆయనొక మానవ హక్కుల కార్యకర్త. 1990లలో పంజాబ్‌లో వేలాది మంది సిక్కు యువకుల అదృశ్యం, ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న నిజాలను ఆయన బయటపెట్టారు. ఆయన పోరాటం వల్ల దాదాపు 25,000కు పైగా మిస్సింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయని చెబుతారు. ఈ క్రమంలోనే, 1995లో కొందరు ఆయన్ని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఈ కేసులో ఆరుగురు పంజాబ్ పోలీసు అధికారులకు శిక్ష పడింది. ఆయన ధైర్యం, త్యాగం, న్యాయం కోసం చేసిన పోరాటాన్ని ఈ సినిమా చూపిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు దాదాపు 120 కట్స్ సూచించడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
33
జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన సేవ నచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నా
Image Credit : instagram

జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన సేవ నచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నా

ఈ సినిమా గురించి దిల్జిత్ దోసాంజ్ మాట్లాడుతూ.. 'మానవత్వం కోసం జస్వంత్ సింగ్ ఖల్రా చేసిన సేవ నచ్చి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నా' అన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఆ కష్టకాలంలో బతికిన వారి అనుభవాలతో ఈ కథ రాశారని, అందుకే స్క్రిప్ట్ తనను కదిలించిందని చెప్పారు. ఖల్రా పాత్ర చేయడం తన కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన అనుభవమని దిల్జిత్ అన్నారు. నిజాయితీ, గౌరవంతో ఈ పాత్రను పోషించానని, ఈ సినిమా ధైర్యం, మానవత్వపు విలువలను ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు హనీ ట్రెహాన్ కూడా ఏళ్ల నిరీక్షణ తర్వాత సినిమా ప్రేక్షకులకు చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కథను నిజాయితీగా చెప్పాలనుకున్నామని, 'సట్లజ్' జస్వంత్ సింగ్ ఖల్రా వారసత్వానికి, మానవ స్ఫూర్తికి నివాళి అని ఆయన అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Recommended image2
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Recommended image3
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అతడెవరు ? దుమ్ము దులిపేసిన కోట శ్రీనివాసరావు
Recommended image2
Sriman: శ్రీనివాస రెడ్డి అలియాస్ శ్రీమన్.. తెలుగోడినే, కానీ నా పేరు కూడా ఎవరికీ తెలియదు..నటుడు ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved