బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే వారసత్వం ఓ మెట్టు మాత్రమే అని శ్రీదేవి కూతురికి మెల్ల మెల్లగా తెలుస్తోంది. హిట్స్ అందుకోవడం కన్నా నటనతో మెప్పించాలి. గ్లామర్ డోస్ కూడా మరి ఎక్కువ కాకుండా కథలో పాత్రకు తగ్గ ప్రాధాన్యత ఉంటేనే కథలను ఒకే చేస్తోంది. రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ అందులో ఒక బయోపిక్ కోసం తెగ కష్టపడుతోంది. 

మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కబోయే సినిమా కోసం జాన్వీ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రెగ్యులర్ గా శిక్షణకు హాజరవుతూనే సినిమా వర్క్ షాప్ కోసం చిత్ర యూనిట్ తో చర్చలు జరుపుతోంది. రీసెంట్ గా జాన్వీకి సంబందించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అవి వైరల్ అయ్యాయి. 

ఇక ఈ బయోపిక్ తో పాటు కరణ్ జోహార్ హిస్టారికల్ మల్టీస్టారర్ 'తఖ్త్' లో కూడా జాన్వీ కీలకపాత్రలో కనిపించనుంది. కరీనాకపూర్ - రణవీర్ సింగ్ - ఆలియా భట్ - భూమి పెడ్నేకర్ - విక్కీ కౌశల్ వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.