నెక్స్ట్ జాన్వీ కపూర్ పెళ్ళే..?

jhanvi kapoor is going to get married soon
Highlights

ఈ లెక్కన కపూర్ ఫ్యామిలీలో నెక్స్ట్ పెళ్లి జాన్వీదే కదా.. 

బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కూడా నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ అహుజాను ప్రేమించిన సోనమ్ నేడు అతడితో పెళ్లి పీటలు ఎక్కనుంది. గడిచిన ఆదివారం నాడు మెహంది వేడుకలను ఘనంగా నిర్వహించింది కపూర్ ఫ్యామిలీ. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో ఒకటి వైరల్ అయింది. ఈ వేడుకలో దివంగత శ్రీదేవి ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు కూడా పాల్గొన్నారు. మెహంది వేడుక సందర్భంగా సోనమ్ కపూర్ పెల్లికుతూరు ధరించాల్సిన ఎర్రటి గాజులు అలానే గాజులతో పాటు కలేరిని ధరించింది.

వారి సంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురు చేతికి ఉండే కలేరిను పెళ్ళికాని అమ్మాయిల తలకు తాకిస్తే ఆ కుటుంబంలో తదుపరి పెళ్లి వారిదే అనే నమ్మకం. దీంతో సోనమ్ కపూర్ తన చేతిని జాన్వీ కపూర్ తలకు తాకించే ప్రయత్నం చేసింది. ఈ లెక్కన కపూర్ ఫ్యామిలీలో నెక్స్ట్ పెళ్లి జాన్వీదే కదా.. అయితే సోనమ్ సారీ జాను అంటూ తలకు తాకించే సమయంలో జాన్వీ టక్కున లేచింది. ఈ వీడియో చూడడానికి చాలా సరదాగా ఉంది. తల్లి మరణం తరువాత జాన్వీ తన కజిన్ పెళ్ళిలో సందడిగా కనిపించింది.   

loader