బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ను ముద్దాడుతోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 2002లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కు జాన్వీ కపూర్ తన తండ్రి బోణీకపూర్తో కలిసి హాజరైంది.

స్టేజ్ పైకి వెళ్లి షారుఖ్ ఖాన్ ను అవార్డు కూడా ఇచ్చింది. జాన్వీ క్యూట్ గా షారుఖ్ ను స్టేజ్ పైకి పిలవగా వెంటనే స్టేజ్ పైకి వచ్చిన షారుఖ్ ఆమెనుప్రేమతో ముద్దుపెట్టుకున్నాడు. చూడముచ్చటగా ఉన్న ఈ వీడియో కాస్త ప్రస్తుతం జాన్వీ 'ధడక్' సినిమా రిలీజ్ కు ఉండడంతో ఇప్పుడు వైరల్ అవుతుంది. జాన్వీతో పాటు స్టేజ్ మీద ప్రీతీ జింతా, బోణీకపూర్ కూడా ఉన్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి!