దివంగత శ్రీదేవి వారసురాలిగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతోంది.

అందం, అభినయం విషయంలో తల్లికి తగ్గ కూతురని జాన్వీని ప్రశంసిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా జాన్వీ డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా శ్రీదేవిని గుర్తుచేసావంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

శ్రీదేవి మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెలానే జాన్వీ కూడా బాగా డాన్స్ చేస్తుంది. త్వరలోనే ఆమె పాల్గొనబోయే ఓ వేడుక కోసం కొరియోగ్రాఫర్ తో కలిసి క్లాసికల్ డాన్స్ రిహార్సల్స్ చేస్తుంది జాన్వీ. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@jahnvikapoor rehearses with full dedication for her performance for an upcoming event.

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jan 22, 2019 at 3:54am PST